Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాల అమలుకు వ్యతిరేకంగా సీనియర్ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి తీసిన 'రైతన్న' సినిమాను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జనగామ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులను, నాయకులను, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని కలిసి జనగామ జిల్లా కేంద్రంలో సినిమాను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను కూడా ఈ నెల 23న ఉదయం 10 గంటలకు జనగామ లో 'రైతన్న' సినిమాను చూస్తానని, తనతో పాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వచ్చి సినిమాను విజయవంతం చేయాలన్నారు