Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
నిషేధిత మత్తుపదార్థాలకు ప్రజలు దూరంగా ఉండాలని స్టేషన్‌ఘన్ పూర్ ఏసీపీ డి రఘుచందర్ అన్నారు. బుధవారం డివిజన్ కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత మాదకద్రవ్యాల మత్తులో జీవితాలు పాడుచేసుకోవద్దని, మత్తులో నేరాలు చేసి సమాజంలో నేరస్తులుగా మారవద్దని అన్నారు. డ్రగ్స్ వాడినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట ప్రకారం హెరాయిన్, కొకైన్, గంజాయి, నాటు సారా లాంటి మత్తు పదార్థాలు వాడడంతో యువత నేరాలు బాట పడుతున్నారన్నారు. కొందరు యువతని కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సరైన మార్గంలో యువత నడుచు కోవాలన్నారు. గంజాయి అమ్ముతూ, రవాణా చేస్తూ పట్టుబడితే గరిష్టంగా 20ఏండ్ల వరకు శిక్ష ఉంటుందన్నారు. యువత ఉన్నత చదువులు చదువుకుని భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ ఎడవెళ్లి శ్రీనివాస్ రెడ్డి, ఎస్సైలు రమేష్ నాయక్, శ్రీనివాస్, పాల్గొన్నారు.