Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఓసీపీలో భూ నిర్వాసితుల ఆందోళన
అ యువతకు ఉపాధి కల్పించాలి
అ ఎంపీపీ మల్హర్రావు
నవతెలంగాణ-మల్హర్రావు
ప్రజాభిప్రాయ సేకరణ 2008లో టీఎస్ జెన్కో, రెవెన్యూ అధికారులు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బుధవారం తాడిచెర్ల, కాపురం భూ నిర్వాసితులు వందమంది తాడిచెర్ల బ్లాక్ -1 ఓసీపీలో సుమారు రెండు గంటలపాటు ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎంపీపీ చింతలపల్లి మల్హర్రావు, బొబ్బిలి రాజు గౌడ్, కుంట సది వారికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీపీ, భూ నిర్వాసితులు మాట్లాడారు. పన్నెం డేండ్ల కిందట ఇచ్చిన హామీలైన 500 మీటర్ల డేంజర్ జోన్లో ఉన్న 1670 ఇండ్లు, మిగులు వ్యవసాయ భూములు సేకరించి, ఇండ్లు కోల్పోయిన ప్రతి భూ నిర్వాసితునికి జెన్కో కంపెనీలో ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పదేండ్ల కిందట గని ఉపరితలంలో కోల్పోయిన కాపురం, ఎస్సీ కాలనీలోని ఇండ్లకు పరిహారం ఇచ్చి, ఆర్అండ్ ఆర్ ప్యాకేజీ, పునరావాసం కల్పించలేదని వెంటనే ఇవ్వాలన్నారు. బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీలో 70శాతం భూ నిర్వాసితులకే ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పదేండ్ల కిందట ఇండ్లు సేకరిస్తామని ఇండ్లకు నెంబర్లు వేసి ఇండ్లను ఇంకా తీసుకోలేదన్నారు. దీంతో నిత్యం ఓసీపీలో బాంబుల బ్లాస్టింగ్స్‌తో ఇండ్లు నెర్రెలు బారుతూ కూలిపోతు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఏఎమ్మార్ కంపెనీ హెడ్ మేనేజర్ ప్రభాకర్ రెడ్డి ఘటనా స్థలికి చేరుకొని మాట్లాడారు. సీఎస్పీలో, కన్వేయర్ బెల్టులో 300 మంది స్థానిక యువతకు మూడు నాలుగు నెలల్లో ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లను, 359.23 ఎకరాల భూములను 2013 భూ సేకరణ చట్టం ప్రకారం సర్వే టైమ్ ద్వారా వారం రోజుల్లో ఆర్డీఓ ఆదేశాల మేరకు సర్వేలు నిర్వహిస్తామని తహసీల్ధార్ శ్రీనివాస్ పేర్కొన్నారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, కానీ కోల్ ఏమర్జెన్సీ ఉందని, ఓసీపీ పనులకు విఘాతం కలిగించొద్దని కాటారం డీిఎస్పీ బోనాల కిషన్ అన్నారు. నిర్వాసితులను అదుపు చేయడానికి కాటారం సీఐ రంజిత్‌రావు, మహదేవ్పూర్ సీఐ కిరణ్, కొయ్యూర్ ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో సుమారు వందమంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కాగా జులై 2021 4,5,6 తేదీల్లో జెన్కో, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లు, భూములను సర్వేలు నిర్వహించడానికి సర్వే టీమ్‌లు వస్తే స్థానికులు సహకరించలేదనే అపవాదు వినిపించడం గమనార్హం.