Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
భూపాలపల్లి జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండగా అవసరమైన భూమిని బుధవారం భూపాలపల్లి ఆర్డీఓ శ్రీనివాస్ పరిశీలించారు. సింగరేణి వెయ్యి క్వార్టర్స్ సమీపంలోని సర్వేనెంబర్ 134లో ప్రభుత్వ భూమిని పరిశీలించారు. స్థలం కళాశాల నిర్మాణానికి అణువుగా ఉన్నట్లు తెలిపారు. సుమారు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా కొందరు ఆ భూమిని కబ్జా చేశారని, కబ్జా భూమిని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం మెడికల్ కళాశాలకు 100 ఎకరాల భూమి అవసరమని తెలిపారు. తహసీల్ధార్ సతీష్‌కుమార్, ఆర్ఐ సాంబయ్య, వీఆర్ఓ శ్రావణ్, వీఆర్ఏ అశోక్, తదితరులు పాల్గొన్నారు