Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలిన ఇద్దరు అన్న దమ్ములకు కళ్యాణి చారిటబుల్ ట్రస్ట్ బుధవారం బాసటగా నిలిచింది. మండలంలోని గోవింద పురం గ్రామానికి చెందిన ఇమ్రాన్, గౌస్ తల్లిదం డ్రులు అనారోగ్యంతో రెండేండ్ల వ్యవధిలో మరణిం చారు. వృద్ధురాలైన వారి నానమ్మతో ఉంటున్నారు. కళ్యాణి చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ ప్రవీణ్ చొరవ తీసుకొని ఇమ్రాన్‌కు చికెన్ షాప్ పెట్టించారు. దుబ్బగూడెం సర్పంచ్ సరితబాలాజి మాట్లాడుతూ సంస్థ చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ వైస్ ప్రెసిడెంట్ కస్న, జనరల్ సెక్రెటరీ హత్తిరాం, సభ్యులు జ్ఞానేందర్, సన్ని, దినేష్, ముఖేష్ పాల్గొన్నారు