Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పలిమెల
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్ట బద్దతకు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని, 24 న మాదిగ ఉద్యోగుల 5వ జాతీయ మహా సభ ను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి జిల్లేల నాగరాజు పిలుపునిచ్చారు. బుధవారం మండల పరిధి సర్వాయిపేట గ్రామంలో సంబంధిత వాల్ పోస్టర్ను ఎమ్మార్పీఎస్ కాటారం డివిజన్ ఇన్చార్జి తూటిచెర్ల దుర్గయ్య తో కలిసి ఆయన ఆవిష్కరించారు. లింగాల నిఖిల్, మహాదేవపూర్ పట్టణ అధ్యక్షులు తిప్పనపెల్లి సమ్మయ్య, సాగర్, మహేష్ నవిన్, నితిన్, దిలీప్ తదితరులు పాల్గున్నారు