Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 2021-2022 తలనీలాలు, కొబ్బరిముక్కలు పోగు చేసుకునే హక్కు బహిరంగ వేలం ద్వారా రూ.9,06,000 లక్షలు దేవాలయానికి ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ బి లక్ష్మీప్రసన్న తెలిపారు. బుధవారం దేవస్థాన కళ్యాణ మండపంలో బహిరంగ వేలం నిర్వహించారు. సికింద్రాబాద్‌కు చెందిన గంధమాల హంసరాజు రూ.4.34వేలకు తలనీలాలు పోగు చేసుకునే హక్కు దక్కించు కున్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా పుల్లేటికుర్రు గ్రామానికి చెందిన విడిఎన్ ప్రసాద్ కొబ్బరి ముక్కలు పోగు చేసుకునే హక్కు రూ.4లక్షల72వేలకు దక్కించుకున్నారు. ఈ వేలంలో పర్యవేక్షకులుగా మల్లూరు దేవస్థానం ఈవో సత్యనారాయణ, వరంగల్ , పరకాల దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్లు డి అనిల్‌కుమార్, ఎన్ అనిల్‌కుమార్, ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు డీవీఆర్ శర్మ పాటదారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.