Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖిలా వరంగల్
ఎస్సీ కార్పొరేషన్ లబ్ది దారులకు రుణాలివ్వాలని, దళితుల సమస్యలు పరిష్క రించాలని కలెక్టరేట్ ఎదుట నేడు నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం శివనగర్‌లో ఆవుల ఉదరు అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మూలుగు రవి, సాంబయ్య, కండ్రాతి రాజు, మిట్టపల్లి రవి, దేశ పాక శేఖర్, కొత్తూరు శంకర్, రాచర్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు
నవతెలంగాణ-పర్వతగిరి
దళితుల సమస్యలు పరిష్కారం కోసం నేడు కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని కెేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోడేటి దయాకర్ పిలుపునిచ్చారు. అన్నారం షరీఫ్ గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమపై జరుగుతున్న దాడులను చెప్పుకుందామంటే ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కూడా లేదని వాపోయారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతిఒక్కరికీ షరతులు లేకుండా దళిత బందు ఇవ్వాలన్నారు. అసైన్డ్ భూములను, బలవంతంగా లాక్కున్న భూములను తిరిగి దళితులకే ఇవ్వాలన్నారు. ఈ ప్రభుత్వానికి దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నేటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు గడ్డం యాకాంబరం, ఆబర్ల రాజు, ఒగ్గు భాస్కర్, వెల్తురు దర్గయ్య, పసునూరి వినరు, ఒగ్గు శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ - ఐనవోలు
నేడు కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు గబ్బెట రాంకుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దళితులు ఉదయం 10గంటలకు బాలసముద్రంలోని ఏకశిలా పార్కుకు రావాలని పేర్కొన్నారు. అక్కడి నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లాలని తెలిపారు.