Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేయూ ఎన్ఎస్ఎస్
కో-ఆర్డినేటర్ ఈక నారాయణ
నవతెలంగాణ - ములుగు
ఆరోగ్యవంతమైన దేశం కోసం ప్రతిఒక్కరూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించాలని కేయూ ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ ఈక నారాయణ తెలిపారు. బుధవారం స్థానిక మహర్షి విద్యాసంస్థలు, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంద ర్భంగా కళాశాల కరస్పాండెంట్ తుమ్మ పిచ్చిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతిఒక్కరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని విధిగా నిర్వర్తి ంచాలన్నారు. సాధ్యమైనంత వరకూ ప్లాస్టిక్‌ను నివారించలన్నారు. పరిసరాల పరిశుభ్యత పాటించాలన్నారు. ప్రతి వ్యక్తి విధిగా మొక్కలు నాటి సంరక్షించాలనాన్నరు. కళాశాల కర స్పాండెంట్ పిచ్చిరెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎన్ఎస్ఎస్ కార్య క్రమాలను విజయవంతం చేయాలని సూచి ంచారు. గ్రామాలలో తడి, పొడి చెత్త వేరు చేయడం ద్వారా కలిగే లాభాలను తెలియ చేయాలని ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల కు సూచించినారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సంజరు కుమార్, ఎన్ఎస్ఎస్ పోగ్రాం ఆఫీసర్స్ టీ సుధాకర్, ఆర్ అభిషేక్, ఎస్ వెంకట్ రెడ్డి, అధ్యాపకులు జాకబ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.