Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అధికారులపై మండిపడిన మేయర్
నవతెలంగాణ -పోచమ్మ మైదాన్
గ్రేటర్ వరంగల్‌లో పారిశుధ్య నిర్వహణ అధ్వాన్నంగా ఉ ండటంతో మేయర్ గుండు సుధారాణి అధికారులపై మండిపడ్డారు. బుధవారం కమిషనర్ ప్రావీణ్యతో కలసి నగరంలోని పోతననగర్ ట్రాన్స్ఫర్ స్టేషన్, పోచమ్మమైదాన్, కాశిబుగ్గ, వరంగల్ బస్టాండ్, శివనగర్‌లోని రహదారులను, శానిటేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. రోడ్లపై బిన్లలో ఉన్న చెత్తను, ప్రతిరోజు క్రమం తప్పకుండా తొలగించాలన్నారు. రోడ్లపై చెత్తా పెరుకు పోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. ఈ సందర్భంగా శివనగర్ పల్లవి ఆసుపత్రి వద్ద నిర్మిస్తున్న డక్ట్ పనులను పరిశీలించి.. పనుల్లో వేగం పెంచి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శివనగర్ మురుగునీరు డక్ట్ కు చేరి నిర్మాణ పనులకు ఇబ్బందులు కలుగుతున్న దష్ట్యా ప్రత్యేక పైపులైన్ వేసి మురుగునీటిని మళ్లించాలని, ఈ పనులు వారంలోగా పుర్తవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వరంగల్ వాల్‌మార్ట్ సమీపంలో మిషన్ భగీరథ పైపులైన్ లికేజీలను పరిశీలించారు. అధికారితో మాట్లాడి నగరంలో లికేజీలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డాక్టర్ రాజి రెడ్డి, ఈఈ శ్రీనివాస్, ఏఈ సతీష్, సానిటరీ సూపర్వైజర్ సాంబయ్య, సానిటరీ ఇన్స్పెక్టర్లు శ్యామ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.