Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి
నవతెలంగాణ-వర్ధన్నపేట
నిబద్దతతో చదివితే యువత ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి తెలిపారు. వర్ధన్నపేట డివిజన్ పరిధిలో ఎంపిక చేసిన యువతకు ఇల్లందలోని రైతు వేదిక ఆవరణంలో ఎర్పాటు చేసిన ఉచిత పోలీస్ శిక్షణ తరగతులను బుధవారం ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన 250మంది విద్యార్థులకు అనుభవజ్ఞలైన అధ్యాపకులతో శిక్షణా తరగతులను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. పోటీ పరీక్షల్లో పాల్గోనే అభ్యర్థులు తప్పని సరిగా సెల్ ఫోన్కు దూరంగా ఉండాలన్నారు. తద్వారా పోటీ పరీక్షల్లో రాణించేందుకు ఆవకాశాలు పెరుగుతాయన్నారు. యువత తమ సమయాన్ని వధా చేయకుండా కఠోర సాధనతో చేయడం అనుకున్న ఉద్యోగాలను సాధించడం కోసం కృషి చేయాలన్నారు. అనంతరం శిక్షణకు హాజరైన అభ్యర్థులకు పోలీస్ కమిషనర్ నోట్ బుక్స్, గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఉచిత శిక్షణ అందజేస్తున్న పీజేఆర్ కోచింగ్ సెంటర్కు రూ.లు 11లక్షల 20 వేల ఆర్థికసాయం అందజేసిన కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత తిరుపతిరెడ్డిని ఆయన సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, వర్ధన్నపేట ఏసీపీ గొల్ల రమేష్, సీఐ సదన్ కుమార్, ఎస్సైలు రామారావు, రాజు, ఇల్లంద, దమ్మన్నపేట సర్పంచులు సాంబయ్య, మంగా తిరుపతిరెడ్డి, కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.