Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జఫర్గడ్
ప్రధాని మోడీ అవలంభిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని సీఐటీయూ మండల కార్యదర్శి యాతం సమ్మయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సమ్మయ్యపాల్గొని మాట్లాడుతూ బిజెపి ఏడేళ్ల కాలంలో ప్రైవేట్ కార్పొరేట్ అనుకూల విధానాల ను వేగంగా అమలు చేస్తోందని మండిపడ్డారు, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుందని కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులకు తలుపులు తీరుతుందని విమర్శించారు.బొగ్గు. రైల్వే. విద్యుత్ స్టీల్ ప్లాంట్లు. ఆయిల్ కంపెనీలు విద్య.వైద్యం. సైతం కార్పొరేట్ అధిపతులకు అప్ప చెపుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. దేశ సార్వభౌమత్వానికి ఆర్థిక స్వావలంబనకు తగ్గించే విధానాలను మానుకోవాలని హెచ్చరించారు.ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలు పెట్రోల్. డీజిల్ వంటగ్యాస్ పైప్లైన్ లను ప్రైవేట్ కార్పొరేట్లకు లిజుకివ్వద్దొని మానిటైజేషన్ విధానాన్ని వ్యతిరేకించాలని అన్నారు. ఈ కార్యక్రమంలొ రామ్ చందర్. ఎండి కాదార్. మల్లయ్య .సురేష్. లక్ష్మీ నర్సు. ఎల్లయ్య. కుమార్ .రమేష్. సాయి. తదితరులు పాల్గొన్నారు.