Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహదేవపూర్
మండల సమస్యల పరిష్కారానికి హైదరాబాద్లోని తెలంగాణ భవనంలో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్కు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుతో కలిసి గురువారం ఎంపీపీ బి.రాణిబారు రామారావు వినతిపత్రం అందజేశారు. అత్యంత వెనుకబడిన దళిత గిరిజన అటవీ మండలమైన మహాదేవపూర్కు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలన్నారు. స్పందించిన మంత్రి కేటీఆర్ నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎంపీపీ తెలిపారు..