Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్యార్థుల తల్లిదండ్రులకు బొమ్మెర పాఠశాల ఉపాధ్యాయుల అవగాహన
నవతెలంగాణ-పాలకుర్తి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు మండలంలోని బమ్మెర ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తున్నారు. బుధవారం బమ్మెర గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రు లను కలిసి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలకు పంపిం చాలని కోరారు. విద్యార్థుల భద్రతతో పాటు బాధ్యత తమదేనని భరోసా ఇచ్చారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే పాఠశాల గేట్ వద్ద ఉపాధ్యాయులే స్వయంగా పాఠశాలకు వచ్చే విద్యార్థులకు శానిటైజర్ చేస్తూ డిజిటల్ ధర్మామీటర్ ద్వారా పరీక్షలు నిర్వహించడం స్ఫూర్తిదా యకం. మహాత్మా హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకులు గంట రవీందర్ పాఠశాలకు అందించిన శానిటైజర్‌తో పాటు విద్యార్థినీ విద్యార్థులకు అందించిన మాస్కులు ధరించు కోవాలని సూచించారు. ఒక్కో విద్యార్థికి టీ షర్ట్ లు అందించారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిది ద్దడంలో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు, పరిశుభ్రత పరిరక్షణ కోసం కమిటీలను వేశారు. ఒక్కో కమిటీకి ఒక ఉపాధ్యాయుడు బాధ్యత తీసుకున్నారు. దీంతో ప్రజాప్రతినిధులతో పాటు విద్యాశాఖ అధికారులు వారిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో అన్ని ప్రభుత్వ పాఠశాలలు అభివద్ధి చెందేందుకు ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు సూర్య ప్రకాష్ వీరన్న అలివేలు నాగేందర్, సునీత, వేదవతి పాల్గొన్నారు