Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు అన్నారు. గురువారం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా అర్ముడ్ రిజర్వు ప్రధాన కార్యాలయంలోని అమరవీరుల స్మారక స్థూపానికి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా ఆయన గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీసులు జాతి సేవకు పునరంకితం కావాలన్నారు. సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల భవిష్యత్తు మంచి కోసం ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతీఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ మొక్కవోని ధైర్యంతో పోలీసులు విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందారన్నారు. ప్రజలకు పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకం కలిగేలా చేస్తున్న కషి ఆమోఘమని చెప్పారు. కొత్తగా పోలీసు బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్న వారికి విధి నిర్వహణలో స్ఫూర్తిని, నూతనోత్తేజాన్ని నింపడమే పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం ప్రధాన ఉద్దేశమన్నారు. అమరుల మరణం వారి కుటుంబసభ్యులకు తీరని లోటని, చనిపోయిన పోలీసుల ఆత్మకు శాంతి కలగాలని తెలిపారు. భూపాలపల్లి, కాటారం డీఎస్పీలు ఏ సంపత్ రావు, బోనాల కిషన్, చిట్యాల భూపాలపల్లి, కాటారం, మహాదేవపూర్ సిఐలు వెంకట్ గౌడ్, వాసుదేవరావు, రంజిత్ రావు, కిరణ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సంతోష్, సతీష్, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీసు అధికారుల సంఘం నేత శోభన్ పాల్గొన్నారు
పోలీసు అమరుల త్యాగాలు చిరస్మరణీయం : డీసీపీ
నవతెలంగాణ-జనగామ
పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని డీసీపీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం జనగామ కేంద్రంతో పాటు మండలాలలోని పోలీస్ స్టేషన్లలో విధి నిర్వహణలో ప్రాణాలు కొల్పోయిన అమర పోలీసులకు నివాళులు అర్పించారు. జిల్లా కేంద్రంలో స్థానిక రైల్వేస్టెషన్ వద్ద నుంచి పోలీస్టేషన్, నెహ్రూపార్క్ మీదుగా ఆర్టీసీ చౌరస్తావరకు పోలీసులు, వివిద యువజన సంఘాల నాయకులు, అటో డ్రైవర్లు, వివిద పార్టీలకు చెందిన నాయకులు, విద్యార్థులు ర్యాలీని నిర్వహించారు. అనంతరం చౌరస్తా ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పోలీస్ అమర వీరుల స్తూపం వద్ద సంస్మరణ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎసీపీ జీ క్రిష్ణ, సీఐ బాలాజీ వరప్రసాద్లతోపాటు పలువురు ప్రజా సంఘాల నాయుకులతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్సైలు, పోలీసులు. ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
వారి సేవలు మరువలేనివి : ఎస్సై
నవతెలంగాణ-మల్హర్రావు
అమరులైన పోలీసుల సేవలు మరువలేనివని కోయ్యుర్ ఎస్ఐ తనుగుల సత్యనారాయణ అన్నారు. గురువారం పోలీస్ అమరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా పోలీసుల అమరుల చిత్ర పటాలకు పూలమాలేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పోలీసుల అమరులకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
వారి ఆశయాల సాధనకు కషి చేయాలి
నవతెలంగాణ-లింగాలఘణపురం
పోలీసు అమరవీరుల ఆశయ సాధనకు ప్రతిఒక్కరు కషి చేయాలని ఎస్ఐ దేవేందర్ అన్నారు. గురువారం పోలీసు అమరవీరుల వారొత్సవాల భాగంగా మండల కేంద్రంలో పోలీసు స్టేషన్ నుండి అమరవీరుల స్థూపం వరకు భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు.
పోలిస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయం : డీసీపీ
నవతెలంగాణ-రఘునాథపల్లి
శాంతిభద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసుల సేవలు చిరస్మరణీయమని జనగామ వెస్ట్ డీసీపీ శ్రీనివాస్ రెడ్డి జనగామ స్టేషన్గన్పూర్ ఏసీపీ ు కష్ణ రఘుచందర్ అన్నారు. గురువారం పోలీస్ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని రఘునాథ్ పల్లి పోలీస్ స్టేషన్ వద్ద అమరవీరుల స్థూపం పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. సీఐలు వినరుకుమార్, బాలాజీ, వరప్రసాద్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సైలు రాజేష్ నాయక్ దేవేందర్, తిరుపతి లక్ష్మణరావు, రవికుమార, మహేందర్ రమేష్, సతీష్ పాల్గొన్నారు.
పోలీస్ అమరులకు ఘన నివాళి
నవతెలంగాణ-పాలకుర్తి
పోలీస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం మండల కేంద్రంలో సీఐ వట్లే చేరాలు ఆధ్వర్యంలో పోలీస్ అమరులకు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండి మదర్ తో కలిసి ఆయన మాట్లాడుతూ ప్రజలకు రక్షణ కల్పించేందుకు పోలీసులు చేస్తున్న కషి అభినందనీయ మన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థ ప్రజల్లో మమేకమై అయిందని తెలిపారు అనంతరం పోలీస్ స్టేషన్ ముందు గల పోలీస్ అమరుల స్తూపం వద్ద పోలీస్ సిబ్బంది తో కలిసి నివాళులర్పించారు.
ఘనంగా పోలిస్ అమరవీరుల వారోత్సవాలు
పోలిస్ అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకుని మండల కేంద్రంలో స్థానిక ఎస్సై ఎల్ పవన్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసు అమరుల స్థూపానికి పూలమాలవేసి అమరులైన పోలీస్ మిత్రులకు నివాళులర్పించారు.