Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
మూడు నెలలు దాటిన ప్రతి పశువుకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని జిల్లా డివిహెచ్ఓ డాక్టర్ కుమార స్వామి అన్నారు. మండల కేంద్రంలో టీకాలు వేసే కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ మోటె ధర్మారావు, ఎంపిటిసి వనిత పున్నం చందర్ రావు తో కలిసి గురువారం ప్రారంభించారు. టీకాల ద్వారా పశువులు ఆరోగ్యంగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారులు శ్రీరాం, విక్రమ్,గోపాలమిత్ర శ్రీనివాస్, చిరంజీవి, తిరుపతి, రాజన్న రైతులు పాల్గొన్నారు.