Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉగాది తరువాత సొంతింటి స్థలాల్లోనే నిర్మాణాలు
మార్చి నుంచి 'పరకాల'కు దళితబంధు
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
నవతెలంగాణ-పరకాల
అర్హులైన ప్రతీఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పించే బాధ్యత తనదేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని వెల్లంపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ల సామూహిక గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామ సర్పంచ్ వెలగందుల కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామంలో 36డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాలు పూర్తిచేసేందుకు అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ పూర్తిచేసినట్టు తెలిపారు. మరికొంత మంది అర్హులైన లబ్ధిదారులు ఉన్నప్పటికీ స్థల సమస్యతో నిర్మాణాలు పూర్తికాలేదన్నారు. 29మంది ఎస్సీలకు కూడా త్వరలోనే ఇళ్లు కట్టిస్తామని పేర్కొన్నారు. ఇండ్లు రానివారు బాధపడొద్దని, తహశీల్దార్ గ్రామానికి వచ్చి అర్హులను గుర్తిస్తారని చెప్పారు. గ్రామానికి ఎన్ని ఇండ్లు అవసరమైతే అన్ని మంజూరు చేయిస్తానన్నారు. హుజురాబాద్ నియోకవర్గంలో 4వేల ఇండ్లు మంజూరైనా నిర్మాణాలు జరగలేదని తెలిపారు. సీఎం కేసీఆర్ పరకాల నియోజకవర్గానికి వేయి ఇండ్లను మంజూరు చేస్తే నియోజకవర్గంలోని సంగెం, ఆత్మకూరు, పరకాల, దామెర, నడికూడ మండలాల్లో లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసి సామూహిక గృహప్రవేశాలు చేయించినట్టు తెలిపారు. ఈ నెల 30వ తేదీలోగా 57సంవత్సరాలు నిండిన వారంతా ఎంపీడీఓ కార్యాలయాల్లో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. వచ్చే నెల నుండి నూతన పింఛన్లు మంజూరవుతాయని చెప్పారు. గృహప్రవేశాల వద్ద ఇండ్లు రాని లబ్ధిదారులు తమకు ఇండ్లు కేటాయించాలని ఎమ్మెల్యేను కోరగా ఆయన వారిని సముదాయించారు. ప్రతీ ఒక్కరికి ఇల్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మొగిళి, ఎంపీపీ స్వర్ణలత, వైస్ ఎంపీపీ చింతిరెడ్డి మధుసుదన్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బండి సారంగపాణి, పీఏసీఎస్ చైర్మన్ నల్లెల్ల లింగమూర్తి, తహశీల్దార్ జగన్మోహన్, పీఆర్ డీఈ లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.