Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూర్ టౌన్
గ్రామ పంచాయతీ సిబ్బందికి జీఓ నెంబర్ 25ను కేటగిరీల వారీగా సవరించి అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల గౌరవ అధ్యక్షుడు కొత్తపల్లి రవి, మండల అధ్యక్షుడు సంతోష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు యూనియన్ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఎంపీడీఓకు వినతిపత్రం అందించారు. అనంతరం రవి, సంతోష్ మాట్లాడారు. మల్టీపర్పస్ విధానంతో గ్రామ పంచాయతీ సిబ్బంది తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని వాపోయారు. దాన్ని వెంటనే రద్దు చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ సిబ్బందికి పీఎఫ్, ఈఎస్ఐ, తదితర సదుపాయాలు కల్పించాలని కోరారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకుడు పాడ్య బీకు, యనమల శ్రీధర్, సంతోష్, రమేష్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.