Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విద్యా శాఖ జిల్లా కోఆర్డినేటర్ సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ-గోవిందరావుపేట
విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కషి చేయాలని విద్యాశాఖ జిల్లా కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి కోరారు. మండలంలోని పసర గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఏబీసీ కార్యక్రమాన్ని గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. దైనందిన కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకునేలా విషయ సంబంధిత ఉపాధ్యాయులు చొరవ చూపాలని సూచించారు. అనంతరం విద్యార్థుల రాత పుస్తకాలను పరిశీలించారు. తెలుగు, ఆంగ్లం, గణిత పాఠ్యాంశాల్లో విద్యార్థుల సామర్థ్యాలను గమనించారు. కార్యక్రమంలో ఎంఈఓ గొంది దివాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.