Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
రాష్ట్రంలోని కులవృత్తులను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నట్టు పెద్దవంగర ఎంపీపీ ఈదురు రాజేశ్వరి తెలిపారు. మండలం లోని చిట్యాల గ్రామంలోని తూర్పు చెరువులో జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో 2.62 లక్షల చేపపిల్లలను ఎంపీపీ గురువారం వదిలారు. అనంతరం ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్ కులస్తులకు, చేపల పెంపకం వృత్తిదారులకు సహకరించేలా నూరు శాతం సబ్సిడీతో చేప పిల్లలను పంపిణీ చేస్తోందని చెప్పారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సహకారంతో మండలంలోని చెరువులు, కుంటల్లో మొత్తం 6.96 లక్షల కట్ల, మేజు, శీలావతి రకా లకు చెందిన చేప పిల్లలను పంపిణీ చేసినట్టు తెలిపారు. ముదిరాజ్ కులస్తులు చేపల పెంపకం ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ముదిరాజ్ కుల వృత్తిదారులకు బీమా, ఇతర అనేక సదుపాయాలు కల్పిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ రావుల శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు పులుగుజ్జ శ్రీధర్, మాజీ అధ్యక్షుడు పిట్టల వెంకటేశ్వర్లు, పాక శ్రీనివాస్, వార్డు సభ్యులు గుంటుక కుమారస్వామి, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, తదితరులు పాల్గొన్నారు.