Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి
నవతెలంగాణ-రాయపర్తి
బాల్య వివాహం సామాజిక దురాచారమని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అన్నారు. ప్రతిఒక్కరూ బాల్యవివాహాలను అరికట్టడంలో భాగస్వాములు కావాలని, తద్వారా బాల్య వివాహ రహిత సమాజాన్ని నిర్మించాలన్నారు. గురువారం స్థానిక ఎంపీపీ కార్యాలయంలో చైల్డ్ లైన్(లోడి మల్టీపర్పస్ సోషల్ సొసైటీ) ఆధ్వర్యంలోలో జిల్లా ప్రోగ్రాం అధికారి వీరబాబు సారధ్యంలో మండల స్థాయి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాల్య వివాహాలను నిర్మూలించడానికి ప్రభుత్వం 2006లో బాల్య వివాహ నిషేధ చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి చదువు ఆపేసిన బాలికలను గుర్తించి, వారూ పైచదువులు చదువుకునేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. బాల్యవివాహాల వల్ల జరిగే అనర్థాలను వివరించారు. అమ్మాయిలకు18, అబ్బాయిలకు 21ఏండ్లు నిండిన తరువాతనే వివాహం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రంగు కుమార్, తహశీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ కిషన్, ఎంఈఓ రంగయ్య, ఏఎస్సై సదయ్య, చైల్డ్‌లైన్ వర్కర్స్ ప్రభ, నిర్మల, మమత తదితరులు పాల్గొన్నారు.