Authorization
Fri March 21, 2025 05:56:55 am
నవతెలంగాణ-నర్సంపేట
తాలూకా లీగల్ సర్వీస్ అథారటీ ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఏజీపీ మోటూరి రవి అన్నారు. గురువారం మండలంలోని ఇటుకాలపెల్లి, లక్నెపెల్లి, ఆకులతండా, రాజపల్లె, కమ్మపెల్లి, గురిజాల, గుంటూరుపల్లి గ్రామాల్లో ఉచిత న్యాయ సలహా అవగాహన సదస్సులు నిర్వహించారు. ఇటుకాలపెల్లి, లక్నెపెల్లి గ్రామాల్లో ఏజీపీ రవి మాట్లాడుతూ.. సమస్య ఉన్న వారు తెల్ల కాగితంపై ధరఖాస్తు చేసినట్లయితే ఉచిత న్యాయ సేవా సంస్థ న్యాయమూర్తి ప్రతి వాదులకు నోటీసుల పంపించి సమస్య పరిష్కారానికి చోరవ చూపిస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పలు చట్టాలను వివరిస్తూ న్యాయం ఏవిధంగా స్వీకరించవచ్చో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ సునీల్, టీఎల్ఎస్ఏ సూపరింటెండెంట్ సుభాష్, సర్పంచ్ గొడిశాల రాంబాబు, మండల రవీందర్, ఎంపీటీసీ భూక్య వీరన్న, ఉప సర్పంచ్ జమండ్ల చంద్రమౌళి, పరాచకపు సంతోష్, టీఎల్ఎస్ఏ అంటెండర్ రాము తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-పర్వతగిరి
వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న ఉచిత న్యాయసేవలను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ గటిక సుష్మ అన్నారు. గురువారం స్థానిక గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 1976లో భారత రాజ్యాంగానికి 39ఏ అధికరణను జతచేసి బీద, బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా న్యాయ సేవలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందించి సర్పంచ్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దర్నోజ్ దేవేందర్, పంచాయతీ కార్యదర్శి సరిత, వార్డు సభ్యులు జీడీ గట్టయ్య, మడూరి రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.