Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను,
పీపుల్ స్టార్ నారాయణమూర్తి
నవతెలంగాణ-జనగామ
విద్యార్థి ఉద్యమాలతో ప్రభుత్వాలకు గుణపాఠం చెబుదామని ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు వీపీ సాను, సినీ నటుడు పీిపుల్ స్టార్ నారాయణమూర్తి పిలుపునిచ్చారు. గురువారం జనగామ జిల్లాలో రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి అధ్యక్షతన నిర్వహించిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో వారు పాల్గొని మాట్లాడారు. విద్యార్థి ఉద్యమాలు మరింత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశంలో రైతు, విద్యారంగ సమస్యలు నానాటికీ పెరిగిపోతున్నాయన్నారు. రైతు సంక్షేమానికి, విద్యారంగ పరిరక్షణకు సమరశీల పోరాటాకు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. లఖింపూర్ ఘటనలో ఎనిమిది మంది రైతులను బీజేపీ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని విమర్శించారు. అనంతరం నారాయణ మూర్తి తన పాటతో ప్రతునిధులను ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర నాయకులు తాటికొండ రవి, జావిద్, మిష్రిన్ సుల్తనియా, అరవింద్ రజనీకాంత్, ధర్మబిక్షం, నరేందర్, శిరీష తదితరులు పాల్గొన్నారు.