Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
సింగరేణి ఓసీ-3లో భూములు కోల్పోయిన భూనిర్వాసితులకు నష్టపరిహారం అందించి పనులు ప్రారంభించాలని భూనిర్వాసితులు గురువారం పనుల్ని అడ్డుకున్నారు. తమకు నష్టపరిహారం అందించి పనులు చేసుకోవాలని కోరారు. దీంతో సింగరేణి అధికారులు ధర్నా వద్దకు వచ్చి భూని ర్వాసితులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కన్న తల్లి లాంటి భూములను సింగరేణి అధికారులు తీసు కొని నానా ఇబ్బందులు పెడుతున్నారన్నారని, డబ్బులు ఇచ్చిన వారికే పరిహారం ఇస్తున్నారని భూ నిర్వాసితులు వాగ్వివాదానికి దిగారు. రెవెన్యూ అధికారులు సింగరేణి అధికారులు కుమ్మక్కై తమను మోసం చేస్తున్నారన్నారు. దీంతో పోలీసులు భూ నిర్వాసితులకు నచ్చజెప్పి వారం రోజుల్లో నష్టపరి హారమందేలా చూస్తామని హామీనివ్వడంతో ధర్నా విరమింపజేశారు.
న్యాయం చేస్తాం : ఆర్డీవో శ్రీనివాస్
సింగరేణి ఓసీ-3లో భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు న్యాయం చేస్తామని భూపాలపల్లి ఆర్డీఓ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. గురువారం ఓసీ-3 ప్రాంతంలో భూనిర్వాసితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భూనిర్వా సితులకు సంబంధించిన 70 ఎకరాల భూమి పెండింగ్లో ఉందన్నారు. సంబంధిత రైతుల తీసుకొచ్చిన ఆధారాలతో ఎవరికి నష్టపరిహారం అందించాలో రెవెన్యూ, సింగరేణి సిబ్బంది చూస్తార న్నారు. కొన్ని తప్పుల తడకగా ఉండడంతో సమస్య తలెత్తిందన్నారు.
సమస్య పరిష్కారానికి రెండు రోజులుగా ఆయా గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. రైతులు ఎవరు మోక మీద ఉన్నారో పరిశీలించి డబ్బులు అందిస్తామని హామీనిచ్చారు. ప్రతిరోజు 20మంది రైతుల పహానీలు పరిశీలి స్తామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్ధార్ సతీష్ కుమార్, ఆర్ఐ సాంబయ్య, వీఆర్ఓ శ్రావణ్ స్వామి సర్పంచులు రైతులు పాల్గొన్నారు