Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నెహ్రూ పార్క్ సెంటర్లో సీఐటీయూ నిరసన
నవతెలంగాణ-జనగామ
కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు కోరారు. జిల్లాలి కేంద్రంలోని నెహ్రూ పార్క్ సెంటర్లో సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాపర్తి రాజు మాట్లాడుతూ... ప్రభుత్వ రంగ సంస్థల్ని బడా, కార్పొరేట్ కంపెనీలకు, అంబానీ, ఆదానీలకు అప్పజేప్పే కుట్రను వీడనాడాలన్నారు. మానిటైజేషన్ పేరుతో పభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు పూనుకోవడం దేశ సార్వభౌమత్వానికి విఘాతమేనన్నారు. రైల్వే విమానయానం, ఓడరేవులు, ఎల్ఐసీలు దేశానికి సంపద సృష్టించే సంస్థలన్నారు. వాటిని కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెట్టడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, వ్యతిరేక చట్టాలు ఉపసవరించుకునే వరకు ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు తాండ్ర ఆనందం, వడ్డేపల్లి బ్లెస్సింగ్టన్, మల్లేష్, రాజ్, సోమయ్య, మల్లేష్, నరసయ్య పాల్గొన్నారు.