Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
నవతెలంగాణ- ఎన్జీఓస్ కాలనీ
పరిమళ కాలనీలో 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితుడు బింగి బిక్షపతిని శిక్షించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. శుక్రవారం కేవీపీఎస్ బృందం బాధిత కుటుంబాన్ని పరామర్శించింది. ఈ సందర్భంగా ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ.. గ్రేటర్ వరంగల్లో పెరిగిపోతున్న ఇటువంటి ఘటనలను అరికట్టేందుకు ప్రత్యేక దష్టితో తగిన చర్యలు తీసుకుని నేరాలను అరికట్టాలన్నారు. కలెక్టర్, మంత్రులు, ఎమ్మెల్యేలు బాధిత కుటుంబానికి సాయం అందించాలని ఆయన కోరారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నగరంలో పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు గబ్బెట రామ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి పోడేటి దయాకర్, మంద యాకయ్య, సింగారం సుమన్, ఓం కుమార్, నాగయ్య, ఐలయ్య, కర్ణాకర్, కుమార్ పాల్గొన్నారు.