Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ చౌరస్తా
లఖింపూర్ ఘటనను నిరసిస్తూ శుక్రవారం కేయూసీ జంక్షన్లో 53, 57 డివిజన్లకు చెందిన సీపీఐ(ఎం) నాయకుల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సంద్భంగా పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు టీ ఉప్పలయ్య మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభత్వుం ఇటీవల తీసుకొచ్చిన నల్లచట్టాలను ఉపసంహ రించుకోవాలన్నారు. నూతల చట్టాలని రద్దు చేయాలని పోరాటం చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి కుమారుడు కారు ఎక్కించి పలువురి మృతికి కారకుడయ్యాడన్నారు. వెంటనే నిందితుడిని శిక్షించడంతో పాటుగా, నిందితుడిని తండ్రిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోనాయకులు వీరన్న, దామోర సుదర్శన్,రవీందర్, అరుణ, లత తదితరులు పాల్గొన్నారు.