Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
జాతీయ న్యాయ సేవాదికార సంస్థ న్యూఢిల్లీ, రాష్ట్ర, ఉమ్మడి వరంగల్ సంస్ట ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని ఎడ్లపల్లి, మల్లంపల్లి,పెద్దతూండ్ల గ్రామాల్లో సర్పంచ్ల అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శులు ఉచిత న్యాయ సేవాధికార కార్యక్రమంపై ప్రజలకు అవగాహన నిర్వహించారు. న్యాయం దృష్టిలో అందరూ సమానులేనని అన్నారు. అందరికి సమాన అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం బి1776లో భారత రాజ్యాంగానికి 39 ఏ జతచేసి పేద, బలహీన వర్గాలకు ఉచితంగా న్యాయ సహాయాన్ని అందించడం జరిగిందన్నారు.
మహాదేవపూర్ : మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ శ్రీపతిబాపు అధ్యక్షతన ఉచిత న్యాయ సేవలపై గ్రామ సభ ద్వారా శుక్రవారం అవగాహన కల్పించారు. న్యాయ సేవల కరదీపిక ను గ్రామ సభ ముందు ఇన్చార్జి గ్రామ కార్యదర్శి సమ్మయ్య వివరించారు. ఆజాద్ కీ అమత్ మహౌత్సవాలు, ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా ఉచిత న్యాయ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి గ్రామ సభ ు నిర్వహిస్తున్నట్టు సర్పంచ్ శ్రీపతిబాపు తెలిపారు. డిస్ట్రిక్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా న్యాయ సేవలు పొందవచ్చన్నారు. నేడు వరంగల్ లో న్యాయ-సాధికారత చట్టాలపై అవగాహన కార్యక్రమం జరుగుతుందన్నారు. ఎంపీపీ బి రాణి బాయి, ఉప సర్పంచ్ సల్మాన్ ఖాన్, వార్డు సభ్యులు మెరుగు స్వప్న, ఉస్మాన్ ఖాన్,భీముని వెంకటస్వామి, సలేహ,పర్శవెన రజిత,పంచాయతీ కో ఆప్షన్ సభ్యులు నర్సెన కష్ణమూర్తి, పారిశుధ్య స్థాయి సంఘం కన్వీనర్ లింగాల రామయ్య,నాయకులు కారెంగుల బాపు రావు, మెరుగు లక్ష్మణ్, శీలం లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.