Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
మల్హర్ మండలం తాడిచెర్ల, పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామాల సరిహద్దుల్లో ఉన్న మానేరును శుక్రవారం ఎంపీపీ చింతలపల్లి మల్హర్రావు మైనింగ్, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. ఇటీవల మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో మానేరుపై నిర్మాణం చేస్తున్న చెక్ డ్యామ్లు, ఇసుక క్వారీలు రావడంతో రెండు జిల్లాల అధికారులు,ప్రజాప్రతినిధులు మావంటే మావని వాపోయారు. ఇవి పెద్దపల్లి జిల్లాకు చెందినవిని, భూపాలపల్లి జిల్లావి కావనడంతో మండల ప్రజాప్రతినిధులు, ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో మానేరు సరిహద్దులు నిర్దారణ చేయాలని, మానేరులో ఉన్న సహజ సంపద ఇసుకపై వచ్చే ఆదాయంలో కొంత సొమ్ము మండల అభివృద్ధికి ఇవ్వాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ తోపాటు పలువురు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అధికారులు మానేరు సరిహద్దులు నిర్దారణ చేయడానికి సన్నద్ధమయ్యారు. కానీ మానేరులో నీటిశాతం ఇంకా తగ్గకపోవడంతో కొన్నిరోజుల తరువాత సర్వే చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా ఏడి సుదర్శన్ రాథోడ్, మైనింగ్ డిఈ రవిందర్, తహశీల్దార్ శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.