Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని జనగామ కలెక్టర్ శివలింగయ్య అన్నారు. శుక్రవారం చిల్పూర్ మండలంలోని మల్కాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య సేవలు, ఆసుపత్రి నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు కరోనా నివారణ టీకాలు వేసుకోని వారు ఎంత మంది ఉన్నారని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో కరోనా వాక్సినేషన్ పూర్తి చేసి కరోనా రహిత మండలంగా తీర్చిదిద్దాలన్నారు. వైద్య సిబ్బంది విధులపై అలసత్వం వహించొద్దని, త్వరితగతిన అన్ని గ్రామాల్లో వంద శాతం టీకాలు పూర్తి చేసి ఆదర్శంగా నిలవాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ జిల్లా అధికారి మహేందర్ రెడ్డి, మండల వైద్యులు, సర్పంచ్ కొంగరి రవి, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.