Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెన్కో, ట్రాన్స్ కో డబ్బులు కేసీఆర్ జేబులో కి
- సింగరేణి అప్పుల కోసం చేతులు చాపడం దారుణం
- ప్రైవేటీకరణను అడ్డుకొని తీరుతాం : ఐఎన్టీయూసీ
నవతెలంగాణ-కోల్బెల్ట్
టీిఆర్ఎస్ అధికారంలోకొచ్చిన నాటి నుంచి సింగరేణిలో రాజకీయం చొప్పించి సింగరేణిని బ్రష్టు పట్టిస్తున్నాడని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్టియుసి) భూపాలపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షుడు జోగ బుచ్చయ్య ఆరోపించారు. భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ట్రాన్స్ కో, జెన్ కో ప్రభుత్వ విద్యుత్ సంస్థల నుండి రావాల్సిన బకాయిలు 12 వేల కోట్ల రూపాయలు వసూలు చేసు కోకుండా, బ్యాంకులకు మాకు అప్పు ఇవ్వండి అని ఓపెన్ ఆఫర్ ఇవ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. దళితులకు అడగకుండానే దళిత బందు ప్రవేశపెట్టిన కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి, సింగరేణి కార్మికులు అరిగోస పడుతుంటే చీమ కుట్టినట్లయినా వ్యవహరించకపో వడం దారుణమన్నారు. జెన్కో, ట్రాన్స్కో 12 వేల కోట్ల రూపాయలు ఏనాడో కెసిఆర్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అయ్యాయని, అందుకే నోరు మెదపడం లేదని విమర్శించారు. సింగరేణి సొమ్మును, సీఎస్ఆర్ నిధుల ను సింగరేణి పరిసర ప్రాంతాలకు ఖర్చు చేయకుండా కేసీఆర్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకు తరలించడం సరికాదన్నారు. సింగరేణి యాజమాన్యం కెసిఆర్ చేతిలో కీలుబొమ్మగా మారిందని కార్మికుల ఇవ్వాల్సిన పి ఎల్ ఆర్ బోనస్ ఒక్కో కార్మిక 72 వేల ఐదు రూపాయలు, ఇతర ఖర్చుల కోసం ఐదు వందల కోట్లు అవసరం ఉండగా వెయ్యి కోట్ల రూపాయల కోసం టెండర్లు పిలవడం దేనికని ప్రశ్నించారు. గతంలో సింగరేణి కార్మికులు దిగిపోయిన రోజే టెర్మినల్ బెనిఫిట్ చెక్కు చేతిలో పెట్టి సాగనంపే వారని, నేడు బెనిఫిట్స్ ఇవ్వడానికి సంవత్సరాలు గడుస్తున్నా యని అనానరు. అప్పులు చేస్తూ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడం కేసీఆర్ మాస్టర్ ప్లాన్ అని అన్నారు. బొగ్గు నిల్వలు ఒక్కో కంపెనీ వద్ద పది రోజుల నుండి నెలకు సరిపడా స్టాకు పెట్టుకున్నా కూడా కల్లబొల్లి కబుర్లు చెబుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఎత్తుగడలు వేసినా సింగరేణి ప్రైవేటీక రణను కాంగ్రెస్ పార్టీ, దాని అనుబంధ సంఘం ఐఎన్టియుసి తరపున అడ్డుకొని తీరుతామని అన్నారు. ఐఎన్టీయూసీ నాయకులు పసునూటి రాజేందర్,అండెం రఘుపతి రెడ్డి ,ఈ .ప్రవీణ్ కుమార్ ,సి హెచ్ సదయ్య బ్రాంచి సెక్రటరీలు బి. అశోక్, బీ.మధుకర్ రెడ్డి, బి. రాములు, కే. శంకర్, బండి శ్రీనివాస్, బి సమ్మయ్య, ఏ సమ్మయ్య, కే రాజయ్య, రాజశేఖర్, ఆర్ ఎస్ భాస్కర్, పి కృష్ణ, గట్టు రాజు, బాలునాయక్ పాల్గొన్నారు.