Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడేండ్లలో ఎమ్మెల్యే చేసిందేమీ లేదు
- ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-వెంకటాపురం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కార్యకర్తలకు తెలిపారు. స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌజ్‌లో శుక్రవారం నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించి గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయాలని చెప్పారు. టీఆర్ఎస్ హయాం లోనే మండలం అభివృద్ధి పథంలో పయనిస్తోందని చెప్పారు. మూడున్నరేండ్లుగా భ్రదాచలం ఎమ్మెల్యే మండలానికి ఏం చేశారో ప్రజలకు వివరించాలని కోరారు. ఈనెల 15న తలపెట్టిన విజయగర్జన సభ విజయవంతానికి శ్రేణులు కృషి చేయా లని కోరారు. సమావేశంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి తెల్లం వెంకట్రావ్, జెడ్పీటీసీ పాయం రమణ, సర్పంచ్ చిడెం యామిలీ, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు గంపా రాంబాబు, పిల్లారిశెట్టి మురళీ, తదితరులు పాల్గొన్నారు.