Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ వైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి
నవతెలంగాణ-ములుగు
మత్స్యకారులకు సకాలంలో చేపపిల్లలను పంపిణీ చేయాలని జిల్లా మత్స్య శాఖ అధికారికి జెడ్పీ వైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి సూచించారు. జెడ్పీ కార్యాలయంలో ఆమె ఆధ్వర్యంలో శుక్రవారం 1, 2, 3, 4, 7వ స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు. జిల్లాలో మత్స్యకారులకు చేపపిల్లలను పంపిణీ చేయడంలో ఆలస్యం కావడానికి గల కారణాల గురించి నాగజ్యోతి అడిగి తెలుసుకుకున్నారు. సకాలంలో చేపపిల్లల పంపిణీ జరిగేలా చూడాలని మత్స్య శాఖ జిల్లా అధికారి వీరన్నను కోరారు. సమావేశాలకు అటవీ శాఖ అధికారులు హాజరు కాకపోవడంతో సంబంధిత అధికారులకు మెమోలు జారీ చేయాలని జెడ్పీ సీఈఓ ప్రసూనారాణికి నాగజ్యోతి చెప్పారు. సమావేశాల్లో జిల్లా ప్రణాళిక, బడ్జెట్, భూగర్భ గనులు, ప్రజాపంపిణీ, ఉపాధి కల్పన, పరిశ్రమలు, ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు, వ్యవసాయం, పశు సంరక్షణ, మార్కెటింగ్, విద్య, ఆరోగ్యం, ఇంజనీరింగ్ విభాగాలు, తదితర అంశాలపై సమీక్షించారు. సమావేశాల్లో జెడ్పీ కోఆప్షన్ సభ్యురాలు వలీయాబీ, జెడ్పీ డిప్యూటీ సీఈఓ రమాదేవి, సూపరింటెండెంట్ రాజు తదితరులు పాల్గొన్నారు.