Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలగాణ-తొర్రూర్ టౌన్
గిరిజన అస్తిత్వమే ఊపిరిగా నిరంకుశత్వాన్ని ఎదిరించిన కొమరం భీంను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని షాట్ అధ్యక్షుడు తీగల కష్ణారెడ్డి కోరారు. మండలంలోని అమ్మాపురం శివారులోని జీకే తండా గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గమ్మ ఆలయం వద్ద కష్ణారెడ్డి ఆధ్వర్యంలో కొమరం భీమ్ చిత్రపటం వద్ద శుక్రవారం కొవ్వొత్తులతో నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడిన మహనీయుడిగా కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్ బానోతు అచ్చమ్మ సోమ్లానాయక్, జర్నలిస్టు, గిరిజన శక్తి నాయకుడు లకావత్ యాదగిరి నాయక్, అమ్మపురం వార్డు సభ్యుడు కోటగిరి సంతోష్, తదితరులు పాల్గొన్నారు.