Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మల్లంపల్లి సర్పంచ్ చందా కుమారస్వామి
నవతెలంగాణ-ములుగు
మండలంలోని పల్లెలను బాలల స్నేహపూర్వక గ్రామాలుగా తీర్చిదిద్దా లని మల్లంపల్లి సర్పంచ్ చందా కుమారస్వామి ఆకాంక్షించారు. ఆ గ్రామం లోని పంచాయతీ కార్యాలయంలో గ్రామ బాలల పరిరక్షణ కమిటీని శుక్రవారం ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడారు. గ్రామ స్థాయిలో బాలల పరిరక్షణ కమిటీలు బలోపేతం అయితేనే బాలల సమస్యలు పరిష్కారమౌతాయని తెలిపారు. బాల్య వివా హాలను నిరోధించాలని, బాలలపై వేదింపులు జరగకుండా జాగ్రత్తలు తీసు కోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ ప్రవీణ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి కొండల్‌రెడ్డి, చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ ప్రణరు, ప్రొటెక్షన్ అధికారి కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.