Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని చల్వాయి గ్రామంలో పేద కుటుంబానికి యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ధన్నసరి సూర్య సాయం అందించారు. చల్వాయి గ్రామానికి చెందిన గుండం లక్ష్మీ అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతి చెందగా ఆమె కుటుంబాన్ని సూర్య ఆదివారం పరామర్శించారు. ఆర్థిక సహాయం అందించారు. మృతురాలి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి చాపల కిషన్రెడ్డి, ఎంపీటీసీలు గుండెబోయిన నాగలక్ష్మీ అనిల్ యాదవ్, చాపల ఉమాదేవి, గ్రామ కమిటీ అధ్యక్షుడు వేల్పుగొండ ప్రకాష్, మండల ప్రధాన కార్యదర్శి వేల్పుగొండ పూర్ణ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింత క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.