Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
నవంబర్ 15న తలపెట్టిన టీఆర్ఎస్ విజయగర్జన సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు తాత గణేష్ కోరారు. మండల కేంద్రంలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బత్తిని రామ్మూర్తి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన విస్తత స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా మండల అధ్యక్షుడు తాత గణేష్, పార్టీ డివిజన్ ఇన్‌ఛార్జి పులిగండ్ల మాధవరావు, మండల ప్రధాన కార్యదర్శి బత్తిని రామ్మూర్తి హాజరై మాట్లాడారు. వరంగల్‌లో జరిగే విజయగర్జన సభకు మండలంలో అన్ని గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామాల్లో ప్రచారం చేయాలని సూచించారు. సమావేశంలో సొసైటీ వైస్‌చైర్మెన్ గంగుల సత్యనారాయణ, పార్టీ అధికార ప్రతినిధి సంకు సత్తిరెడ్డి, పార్టీ ఉపాధ్యక్షులు తిరుమల ప్రభాకర్‌రెడ్డి, మీసాల వెంకటయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శులు అడిదల లక్ష్మణ్‌నాయక్, వీరభద్రం, సంయుక్త కార్యదర్శి నిమ్మల రామారావు యాదవ్, నాయకులు అరుణ్‌కుమార్, ఉపేందర్, రాజు, సూరం సుధాకర్‌రెడ్డి, బానోతు లక్ష్మణ్, రేఖ ఉప్పలయ్య, రేపాకుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.