Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎస్పీ జిల్లా కార్యదర్శి పరశురాములు
నవతెలంగాణ-కురవి
బహుజన రాజ్యాధికార సాధనలో యువత ముందుం డాలని బీఎస్పీ జిల్లా కార్యదర్శి ఐనాల పరశురాములు కోరారు. మెడికల్ కాలేజీ పేరుతో గిరిజనుల భూములను లాక్కుంటే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. మండల కేంద్రంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఇంటింటికీ బీఎస్పీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆ పార్టీ డోర్నకల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి తగరం నాగన్న అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి పరశురాములు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్, విశ్రాంత ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ నాయకత్వంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి, ప్రజాసమస్యల పరిష్కారానికి పాటు పడతామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు పేరుతో గిరిజనుల భూములను లాక్కోవడం, ప్రశ్నించిన గిరిజన మహిళలను జైలు పాల్జేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తగిన రీతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ డోర్నకల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఐతం ఉపేందర్, కోశాధికారి భాషిపంగు మహేందర్, నాయకులు ఇరుగు నాగరాజు, ఇరుగు కార్తీక్, అన్వేష్, సలీమ్, ప్రణరు భాస్కర్, ప్రశాంత్, ప్రణరు, అనిత, వీరన్న, సైదులు, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.