Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రైతులు ధర్నా
నవతెలంగాణ-జనగామ
ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బోడ నరేందర్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక మార్కెట్ యార్డు ఎదుట ఈ మేరకు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టం చేసి పండించిన ధాన్యం దళారుల పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ ధరలకు వ్యాపారస్తులు, దళారులు ధాన్యం కొనుగోలు చేసి రైతులను నిలువునా ముంచుతున్నారని వాపోయారు. ప్రభుత్వం ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంబించక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. వ్యవసాయ మార్కెట్లో రైతులకు కనీస మౌలిక వసతులని కల్పించాలని, దళారుల దోపిడీని నుంచి రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సాంబరాజు యదగిరి, పోత్కనూరి ఉపేందర్, దర్మబిక్షం, నాగరాజు, అజారుద్ది, దడిగే సందీప్, నాయకులు అనందం తదితరులు పాల్గొన్నారు.