Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ మండల కమిటీని నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు మూర్తి బద్రి, ప్రధాన కార్యదర్శి దనసరి పాపయ్య తెలిపారు. మండలంలోని కొమరం భీంనగర్ కాలనీలో శనివారం కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా మూయబోయిన వెంకన్న, ప్రధాన కార్యదర్శిగా మేడ వెంకన్న, ఉపాధ్యక్షుడుగా చుంచ లక్ష్మయ్య, గౌరవ అధ్యక్షుడుగా అల్లం యశోద, సహాయ కార్యదర్శిగా ఈసం సూర్యనారాయణ, కోశాధికారిగా రేగ సాంబయ్య, సాంస్కృతిక కార్యదర్శిగా నారాయణ, ప్రచార కార్యదర్శిగా కొట్టం రవీందర్, మహిళ కార్యదర్శిగా వాసం కొమ్మక్క, కార్యవర్గ సభ్యులుగా దారం వెంకటేశ్వర్లు, రేగ వెంకన్న, పూనెం చంద్రయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వెంకన్న మాట్లాడారు. సంఘం బలోపేతానికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పాటు పడతామని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సువర్ణపాక పాపయ్య, నాయకులు పెనుక ప్రభాకర్, గట్టి శ్రీను, కొట్టం వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.