Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
మండలంలో ఎయిర్టెల్ సిగల్ వ్యవస్థను ఆటంకాల్లేకుండా మెరుగుపర్చాలని సీపీఐ(ఎం) జిల్లా నాయకుడు కందునూరి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూ సెంటర్లో శనివారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు. అత్యధిక మంది వినియోగ దారులున్న ఎయిర్టెల్ సిమ్ కార్డుల్లో సిగల్ సరిగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంద న్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ కార్యాలయాలు, మీ సేవా సెంటర్లు, నెట్ సెంటర్లు, రేషన్ దుకాణాల్లో సిగల్ లేక ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత బాధ్యులు స్పందించి చొరవ చూపాలని కోరారు. కార్యక్రమం లో నాయకులు బాజీ, పూర్ణ, ఐలేష్, శ్రీను, నాగ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.