Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్పర్తి
పశువుల పెంపకంతో రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుందని సర్పంచ్ చిర్ర సుమలత విజరుకుమార్ అన్నారు. మడిపల్లిలో పశువైద్యాధికారి డాక్టర్ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన గాలికుంటు వ్యాధి నివారణ టీకా శిభిరాన్ని సర్పంచ్ ప్రారంభించి మాట్లాడారు. గ్రామంలో రైతులు పాడి పశువుల మీద ఆధారపడి వ్వయసాయం చేస్తున్నారన్నారు. రైతులకు అందుబాటులో ఉంటూ పశుసంవర్ధక శాఖ ఉచితంగా గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో వీఎల్ఓ బింగి సురేష్, జేవీఓ శారద, నబి, కిరణ్, అనిల్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-గీసుకొండ
గాలి కుంటు వ్యాధి నివారణ కోసం పశువులకు తప్పనిసరిగా టీకాలను వేయించాలని సర్పంచ్ కేలోత్ సరోజా స్వామి చౌహన్, వెటర్నరీ డాక్టర్ రమ్య తెలిపారు. శనివారం దసృతండాలో పశువులకు టీకా శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. రైతులు తమ పవువలకు తప్పనిసరిగా ఈ శిబిరాన్ని ఉపయోగించుకుని టీకాలు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర ఇస్మాయిల్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-సంగెం
నార్లవాయిలో సర్పంచ్ కోడూరు రజితా రమేశ్, షాపూర్లో సర్పంచ్ సట్ల రాజులు శనివారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ పశువులకు టీకాలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశువైద్యాధికారులు డాక్టర్ వల్లే రాజు, వంశీ, ఉపసర్పంచ్ రవి, వైద్య సిబ్బంది ఎండీ సుకుమియా, గోపాల మిత్ర బాబు, కమలాకర్, శ్రీను, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.