Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన
నవతెలంగాణ-చెన్నారావుపేట
పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రూపిక శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ.. మోదీ అచ్చేదిన్ అన్ని చెప్పి జనాలు చచ్చే దిన్ తెచ్చారని వ్యంగ్యంగా మాట్లాడారు. వెంటనే పెంచిన పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలన్నారు. లేకుంటే బీజేపీ, టీఆర్ఎస్ కార్యాలయాలను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ హయాంలో 60రూపాయలు దాటని పెట్రోలు మోడీ ప్రభుత్వంలో సెంచరీ కొట్టిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల యువజన అధ్యక్షులు బండి హరీష్, గ్రామ యూత్ అధ్యక్షులు లక్కరాజు, ఉపాధ్యక్షులు విజరు, అశోక్ రెడ్డి, జైపాల్ రెడ్డి, రాజు, విజేందర్, భరత్, నరేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు