Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాధితులకు నాయ్యం చేయాలి
- కేవీపీఎస్ ఆధ్వర్యంలో వినతి..
నవతెలంగాణ-సుబేదారి
ఇటీవల పరిమళ కాలనీలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కేవీపీఎస్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం కేవీపీఎస్ నాయకులతో కలిసి హన్మకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, నిందితుడి బింగి బిక్షపతి బాలికపై అత్యాచారానికి పాల్పడటం సమాజం తలది ంచుకునే చర్యగా భావించాలన్నారు. మహి ళలపై, బాలికలపై, యువతులపై సోదర భావాన్ని పెంపొందిచే విధంగా చైతన్య వంతమైన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బాలిక తండ్రి శ్రవణ్ మాట్లాడుతూ.. తన కూతురుపై అఘాయిత్యానికి పాల్పడిన బింగి బిక్షపతిని కఠినంగా శిక్షించాలని, తమకు న్యాయం చేయాలని కోరారు. కూతుర్లు ఉన్న ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదని, మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ఇటువంటి ఘటన దురదృష్టకరమని, బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబీకులు లక్ష్మి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు గబ్బెట రామ్ కుమార్, సింగారం సుమన్, మంద కుమార్, రాజేష్, నాగయ్య, తదితరులు పాల్గొన్నారు