Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపర్తి
విద్యార్థులకు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డీసీఈబీ సెక్రటరీ గారె కష్ణమూర్తి అన్నారు. శనివారం డీఈఓ ఆదేశాల మేరకు మండలంలోని కేశవ పురం, కొలనుపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల్లో జరుగుతున్న 30రోజుల ఏబీసీ-30 ప్రోగ్రాం, ఎన్ఏఎస్-2021 సంసిద్ధత కార్యక్రమాల నిర్వహణ గురించి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు సరైన విద్యను అందించాలని సూచించారు. విద్యార్థులు సైతం కష్టంతో కాకుండా ఇష్టంతో విద్యను అభ్యసించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.