Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని ఆ పార్టీ పెద్దవంగర మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య తెలిపారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశానికి ఐలయ్య అధ్యక్షత వహించి జీసీసీ మాజీ చైర్మెన్ గాంధీనాయక్తో కలిసి మాట్లాడారు. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పారు. ఈనెల 27న పాలకుర్తిలో తలపెట్టిన నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని, నవంబర్ 15న తలపెట్టిన విజయగర్జన సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు జాటోత్ నెహ్రూనాయక్, మండల కోఆర్డినేటర్ పాకనాటి సోమిరెడ్డి, ఉపాధ్యక్షులు వెంకన్న, జనగాం సత్యనారాయణ, బంధు వెంకన్న, బానోత్ వెంకన్న, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజరు, మండల నాయకులు శ్రీరామ్ సుధీర్, మండల అధికార ప్రతినిధి బానోతు సోమన్న, మండల యూత్ అధ్యక్షుడు కాసాని హరీష్, మాజీ జెడ్పీటీసీ జలగం వెంకటయ్య, యూత్ నాయకులు మైలపాక అనిల్, తదితరులు పాల్గొన్నారు.