Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏటీడీఓ దేశీరాంనాయక్
- ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు యూనిఫారాలు పంపిణీ
నవతెలంగాణ-తాడ్వాయి
కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే విద్యార్థులకు తరగతులు నిర్వహించాలని ఏటీడీఓ దేశీరాంనాయక్ కోరారు. ఈనెల 21న ఆశ్రమ పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో మండలంలోని లింగాల పంచాయతీ పరిధిలోని కొడిశెల ప్రభుత్వ గిరి జన ఆశ్రమ బాలుర పాఠశాలను శనివారం ఆయన సందర్శించి పరిశీలించారు. పాఠశాలలోని తరగతి గదులను, వంటశాలను, స్నానపు గదులను ప్రత్యక్షంగా సందర్శించారు. అనంతరం హెచ్ఎం సుతారి రమేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏటీడీఓ దేశీరాంనాయక్ మాట్లాడారు. పాఠశాలలో ప్రతిరోజూ శానిటేషన్ చేయించాలని చెప్పారు. విద్యార్థులు భౌతికదూరం పాటిస్తూ మాస్క్లు ధరించాలని, ఇతర కోవిడ్ నిబంధనలు పాటించాలని చెప్పారు. ఆ దిశగా ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని సూచించారు. పాఠశాలలు పరిశుభ్రంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత సర్పంచ్, ఉపాధ్యాయులపైనే ఉందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు. కార్యక్రమండలో ఉపాధ్యాయులు పెనక సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.