Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కేంద్రంలో విక్రయ కేంద్రాన్ని ప్రారంభం
నవతెలంగాణ-ములుగు
మట్టిపాత్రల్లో చేసిన వంటకాలతోనే ఆరోగ్యం బాగుంటుందని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి లక్ష్మణ్, జిల్లా పంచాయితీ అధికారి వెంకయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలో ఆశాడపు హరీష్ ప్రజాపతి ఏర్పాటు చేసిన ప్రజాపతి మట్టిపాత్రల విక్రయ కేంద్రాన్ని శనివారం వారు ప్రారంభించి మాట్లాడారు. మట్టి పాత్రల వాడకం ఆరోగ్యానికి మంచిదన్నారు. అల్యూమినియం, సిరామిక్, ప్లాస్టిక్ ద్వారా తయారైన పాత్రల వినియోగం వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. విక్రయ కేంద్రాన్ని జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశాడపు దేవేందర్ ప్రజాపతి, కోశాధికారి కొత్తపల్లి బాబురావు, డీఎల్పీఓ దేవరాజ్, ఎంపీడీఓ హన్మంతరావు, పంచాయతీ కార్యదర్శి సతీష్, తదితరులు పాల్గొన్నారు.