Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేపై ఎమ్మెల్సీ విమర్శలు విడ్డూరం
- సీఎం నిధులిస్తేగా అభివృద్ధి చేసేది..!
- ఎమ్మెల్యేపై బాలసాని వాఖ్యలు హాస్యాస్పదం
నవతెలంగాణ-వెంకటాపురం
సీఎం కేసీఆర్ పదువులిస్తామని ఆశ చూపినా పార్టీ వీడని వ్యక్తి భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అని, అలాంటి వ్యక్తిని పదవుల కోసం పార్టీలు మారే ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ విమర్మించడం విడ్డూరంగా ఉందని ఎంపీపీ చెరుకూరి సతీష్ , వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్, సీనియర్ నాయకులు చిడెం శివ, పల్నాటి నాగేశ్వర్రావు విమర్శించారు. స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీపీ సతీష్, వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్, శివ, నాగేశ్వర్రావు మాట్లాడారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గాల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సైతం నిధులు కేటాయించడం లేదన్నారు. ఇక ప్రతిపక్ష పార్టీకి నిధులు కేటాయిస్తారా అనే విషయం ఆలోచించుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ బాలసాని స్వగ్రామానికి, సొంత మండలానికి ఏం చేశారో చెప్పాలన్నారు. గిరిజన ఎమ్మెల్యే అయినందువల్లే అధికార పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కల్యాణలక్ష్మీ పథకానికి సీఎం కేసీఆర్ సొంత డబ్బులు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. గిరిజన ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి బాలసానికి లేదన్నారు. సమావేశంలో ఎంపీటీసీలు కొండపర్తి సీతాదేవి, గారసాటి రవి, నాయకులు చిట్టెం శ్రీనివాస్, సుందర్రావు, శ్రీరాములు రమేష్, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.