Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ
నవతెలంగాణ-చిట్యాల
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 84 మంది లబ్ధిదారులకు శనివారం ఆయన కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. స్వరాష్ట్ర ఏర్పాటుకు ముందుకు ప్రజల జీవన విధానం దారుణంగా ఉండేదన్నారు. స్వరాష్ట్ర ఏర్పాటు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలుస్తోందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సమర్ధవంతంగా అమలు చేస్తోందన్నారు.
ఆరోగ్య కేంద్రంలో తనిఖీ
మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రిని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి తనిఖీ చేశారు. ఆస్పత్రి సిబ్బంది పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైద్యుల కొరతను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. అనంతరం ఏలేటి రామయ్యపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు మెరుగైన భోజనం, పుస్త కాలు, యూనిఫారం అందజేతపై అడిగి తెలుసుకున్నారు. అదనపు గది నిర్మాణం కోసం తహసీల్దార్‌ను ఫోన్లో ఆదేశించారు. కార్యక్రమం లో ఎంపీపీ వినోద వీరారెడ్డి, జెడ్పీటీసీ గొర్రె సాగర్, వైస్ ఎంపీపీ నిమ్మగడ్డ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.